Monday 20 February 2012

మనసే అందాల బృందావనం


మీకు  1965 లో విడుదలైన  "మంచి కుటుంబం" చిత్రంలోని "మనసే అందాల బృందావనం" పాట గుర్తుందా?.నాకు చాల నచ్చిన  పాట.  సుశీల గారు అద్భుతంగా పాడిన పాట. S.P. కోదండపాణి స్వర పరచిన ఈ పాటను రాసిన వారు, శ్రీ ఆరుద్ర గారు. 47  సంవత్సరాల పాటకు ఇంకా ఆదరణ ఉందంటే, ఆ పాట గొప్పతనం ఏమిటో చెప్పనలవి కాదు. ఆ పాత మధురాలు, వాడి పోనీ కుసుమాలు, కడిగిన ముత్యాలు. ఆ పాట వినండి, ఆనందించండి.




Sunday 19 February 2012

   నాకు  నచ్చిన పాటగా, నిన్న "మౌనంగానే ఎదగమని" పోస్ట్ చేశాను. నేడు, నేను మెచ్చిన పాటగా, "నేనున్నాను" చిత్రంలోని  "వేణుమాధవా, ఏ శ్వాసలో చేరితే", అనే పాటను సమర్పిస్తున్నాను.   చిత్ర గారు  పాడిన పాట. శ్రీ కీరవాణి గారు  అద్భుతంగా స్వర పరచిన పాట. గీత రచన: శ్రీ సీతారామ శాస్త్రి గారు. చిత్రం విడుదల:
07-04-2004.   

Friday 17 February 2012

మౌనంగానే ఎదగమని

నాకు చాలా నచ్చిన పాట,   నేను మెచ్చిన పాట, ఎందరికో నచ్చిన పాట " మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది."  చిత్రం: నా ఆటోగ్రాఫ్ నా స్వీట్ మెమోరీస్.  చిత్ర గారు అద్భుతంగా పాడిన పాట. ఎంత ఎదిగినా,
జీవితంలో, ఒదిగి ఉండమని చెప్పకనే చెప్పే నగ్న సత్యం ఇందులో ఉంది. సాదించాలని పట్టుదల ఉంటె, వికలాంగులైన, సకలాన్గులైన విజయాన్ని అందుకోవచ్చని సందేశం ఇచ్చిన పాట. ఈ పాట వింటూ ఉంటె, కంట తడి పెట్టని వారు ఉండరేమో, అంతలా మనసుని కదిలించిన పాట. మీరూ వినండి. గీత రచన: చంద్రబోసు, సంగీతం: M .M .కీరవాణి, చిత్రం విడుదల: 11 -08 -2004 .చిత్ర దర్శకుడు: S.గోపాల్ రెడ్డి.